భారత్ కు 60 కోట్లు సాయం ప్రకటించిన కెనడా
- April 28, 2021
న్యూ ఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారత్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కి చేరింది.ఈ నేపథ్యంలో భారత్ కు అండగా నిలుస్తామని ఇప్పటికే చాలా దేశాలు మద్దతు ప్రకటించాయి.అందులో భాగంగానే వైద్య సామగ్రి, ఆక్సిజన్ ను భారత్ కు అందిస్తూ తమ వంతు సాయం అందిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం కూడా 10 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా ప్రకటించింది.మానవతా దృక్పథంతో 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను కెనడియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నట్లు కెనడా అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ది శాఖ మంత్రి కరీనా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







