తెలంగాణలో జర్నలిస్టుల కోసం హెల్ప్‌ డెస్క్‌

- May 01, 2021 , by Maagulf
తెలంగాణలో జర్నలిస్టుల కోసం హెల్ప్‌ డెస్క్‌

హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్ వైద్యేసవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశమైంది. జర్నలిస్టుల అవసరాలను గుర్తించిన అధికారులు శనివారం నుంచి  ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ 8639710241 ను అందుబాటులో ఉంచుతామని  చెప్పారు.కరోనా లక్షణాలున్న జర్నలిస్టుల వివరాలను అందులో అప్‌లోడ్‌ చేస్తే పరిశీలించి  వైద్య  పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్లను  కేటాయించేందుకు ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.జర్నలిస్టుల కోసం త్వరలో హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com