తెలంగాణలో జర్నలిస్టుల కోసం హెల్ప్ డెస్క్
- May 01, 2021
హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్ వైద్యేసవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేస్తున్నట్లు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రెస్‌క్లబ్ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశమైంది. జర్నలిస్టుల అవసరాలను గుర్తించిన అధికారులు శనివారం నుంచి ప్రత్యేక వాట్సాప్ నంబర్ 8639710241 ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.కరోనా లక్షణాలున్న జర్నలిస్టుల వివరాలను అందులో అప్లోడ్ చేస్తే పరిశీలించి వైద్య పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్లను కేటాయించేందుకు ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.జర్నలిస్టుల కోసం త్వరలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









