7 దేశాల పై ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్
- May 02, 2021
జెరూసలేం: కోవిడ్ సెకండ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.దీంతో.. క్రమంగా చాలా దేశాలు విదేశీ ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.తమ దేశస్తులు అయినా సరే విదేశాలకు వెళ్తే.. మళ్లీ అంత ఈజీగా వాళ్లు స్వదేశంలో అడుగుపెట్టే పరిస్థితులు లేకుండా పోతున్నాయి.తాజాగా.. భారత్ సహా ఏడు దేశాలకు తమ పౌరులు ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది ఇజ్రాయెల్ .. కోవిడ్ నేపథ్యంలో..ఇజ్రాయెల్ తమ దేశ పౌరులపై ఈ ఆంక్షలు తీసుకొచ్చింది.ఈ నెల 3వ తేదీ నుంచి కొత్త ఆంక్షలు అమలులోకి రానుండగా.. 16వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది ఇజ్రాయెల్.ఇక, ఇజ్రాయెల్ ఆంక్షలు విధించిన దేశాల జాబితా గమనిస్తే భారత్‌లో పాటు ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా,మెక్సికో,టర్కీ కూడా ఉన్నాయి.ఈ ఏడు దేశాల నుంచి ఇజ్రాయెల్ వచ్చే ప్రయాణికులు మాత్రం 14 రోజులు క్వారంటైన్లో ఉండటం తప్పనిసరి చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







