7 లేన్లుగా ఎమిరేట్స్‌ రోడ్‌ విస్తరణ

- March 03, 2016 , by Maagulf
7 లేన్లుగా ఎమిరేట్స్‌ రోడ్‌ విస్తరణ



దుబాయ్‌, సార్జాలను కలిపే ఎమిరేట్స్‌ రోడ్‌ని విస్తరించనున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రోడ్డును విస్తరించాలనే ఆలోచన చేశారు. మూడు నుంచి ఏడు లేన్లదాకా రోడ్లను విస్తరించడం ద్వారా ప్రమాదాల్ని నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. దుబాయ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ చీఫ్‌ కల్నల్‌ సైఫ్‌ అల్‌ మజ్రోయి మాట్లాడుతూ, 2 నుంచి 7 కిలోమీటర్ల విభాగంలో షార్జా సిటీ ప్రారంభం నుంచి మ్లాయిహా రోడ్‌ ఎగ్జిట్‌ మీదుగా ఈ విస్తరణ ఉంటుందని చెప్పారు. కొన్ని చోట్ల 10 లేన్లుగా కూడా విస్తరించే అవకాశం ఉందని ఆయన అన్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడం, ప్రమాదాల్ని నివారించడంలో భాగంగా చేపడ్తున్న ఈ విస్తరణకు 18 నెలల సమయం పడ్తుందని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com