ఆస్తి ప్రదర్శనలో ఆధిక్యతను చూపనున్న భారతదేశం

- March 03, 2016 , by Maagulf
ఆస్తి ప్రదర్శనలో ఆధిక్యతను చూపనున్న భారతదేశం

దుబాయ్ లో, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరగనున్న అంతర్జాతీయ ఆస్తి వార్షిక ప్రదర్శన కార్యక్రమంలో  భారతదేశం తన బలమైన ఉనికిని చాటుకొనుందని వ్యూహాత్మక మార్కెటింగ్ మరియు ప్రదర్శన కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. గత ఏడాదితో సరిపోల్చితే, ఈ ఏడాది దాదాపు 15 కంపినీలు వారి వారి పధక నమూనాలతో ఇక్కడ ప్రదర్శనతో, 5 లక్షల ప్రవాస భారతీయులే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. దుబాయ్ లో అంతర్జాతీయ ఆస్తి వార్షిక ప్రదర్శన  ఈ ఏడాది ఏప్రిల్ 11 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు జరుగుతుందని  ఖలీజ్ టైమ్స్ ' తెలిపింది. ఈ ప్రదర్శనలో విదేశాలలో పెట్టుబడి పెట్టె భారతదేశానికి చెందిన పలువురు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. 2006 నుంచి 2015 మధ్య కాలంలో భారత్ పేట్టుబడులు భారీ ఎత్తున పెరిగినట్లు పేర్కొంటూ , 120 బిలియన్ల దిర్హామ్స్ ( 36.6 మిలియన్ అమెరికన్ డాలర్లు ) విలువ కల్గి ఉందన్నారు. గతంలో అతి పెద్ద పెట్టుబడి సమూహంగా ఉన్న బ్రిటన్ మరియు పాకిస్తాన్ ను ప్రస్తుతం భారత్ అధిగమించింది. ఇపుడు భారత్ దేశం ఆయా దేశాల కన్నా అధికంగా 57 వేల ఆర్ధిక కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ , భారతదేశం  మధ్య ఉన్నసన్నిహిత సంబంధాల కారణంగా అత్యధికంగా ఇరు దేశాల నుంచి పెట్టుబడుల వెల్లువ వరద  మాదిరిగా ప్రవహిస్తుందని ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అది ఎక్కువగా వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రదర్శనల అధ్యక్షుడు దావూద్ అల్ శేజావి తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో ఆస్తులను కొనేందుకు భారత్ పెట్టుబడీదారుల వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు. ఈ  సందర్భంగా భారత్ కు చెందిన దౌత్య అధికారి అనురాగ్ భూషణ్ మాట్లాడుతూ, 26 వేల భారతదేశానికి చెందిన కంపినీలు యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో పనిచేస్తున్నాయని , అదే విధంగా భారతదేశానికి చెందిన బ్యాంకులు , ఆర్ధిక సంస్థలు 20 వరకు ఇక్కడ ఉన్నాయని తెలిపారు.

 

    

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com