7 లేన్లుగా ఎమిరేట్స్ రోడ్ విస్తరణ
- March 03, 2016
దుబాయ్, సార్జాలను కలిపే ఎమిరేట్స్ రోడ్ని విస్తరించనున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రోడ్డును విస్తరించాలనే ఆలోచన చేశారు. మూడు నుంచి ఏడు లేన్లదాకా రోడ్లను విస్తరించడం ద్వారా ప్రమాదాల్ని నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ కల్నల్ సైఫ్ అల్ మజ్రోయి మాట్లాడుతూ, 2 నుంచి 7 కిలోమీటర్ల విభాగంలో షార్జా సిటీ ప్రారంభం నుంచి మ్లాయిహా రోడ్ ఎగ్జిట్ మీదుగా ఈ విస్తరణ ఉంటుందని చెప్పారు. కొన్ని చోట్ల 10 లేన్లుగా కూడా విస్తరించే అవకాశం ఉందని ఆయన అన్నారు. రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రమాదాల్ని నివారించడంలో భాగంగా చేపడ్తున్న ఈ విస్తరణకు 18 నెలల సమయం పడ్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







