భారత్ లో కరోనా కేసుల వివరాలు

- May 04, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది.తాజాగా భారత్ లో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది.ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్టు సమాచారం.ఇక గడిచిన 24 గంటల్లో 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇదిలా ఉంటె, 24 గంటల్లో భారత్ లో కరోనాతో 3,449 మంది మృతి చెందారు.  దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,22,408కి చేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com