వ్యాక్సిన్ తీసుకోకుంటే పౌరులను కూడా అనుమతించబోమన్న కువైట్
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఆంక్షల తీవ్రతను పెంచుతూ వస్తోంది కువైట్. ప్రస్తుతానికైతే కువైట్ లో కోవిడ్ కేసుల తీవ్రత స్థిరంగానే ఉన్నా...భవిష్యత్తు ముప్పు నుంచి తప్పించుకునేందుకు పలు ముందస్తు జాగ్రత్తలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా కువైట్ వచ్చే పౌరులకు సంబంధించి కూడా కొత్త సూచనలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని పౌరులు, వారి భార్య, భర్త, పిల్లలను కూడా అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలాగే పౌరులలో ఇళ్లలో పని చేసే గృహ కార్మికులకు కూడా పర్మిషన్ ఉండదని వెల్లడించింది.ఈ మేరకు మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కొత్త నిర్ణయాలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి.అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హులైన వయసువారికి మాత్రం ఎలాంటి నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే దేశం విడిచి వెళ్లే వారు రోడ్డు, సముద్ర మార్గాల్లో వెళ్లొచ్చని, అదీ కూడా మూడు కేటగిరి వారికే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. పశువులతో ఓడరేవుల దగ్గర సిద్ధంగా ఉన్నవారు, జీసీసీ దేశాల్లో ఆస్తులు ఉన్న వారు, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లే వారు సముద్ర, రోడ్డు మార్గంలో దేశం విడిచి వెళ్లొచ్చు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







