వాట్సాప్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్
- May 05, 2021
దుబాయ్: రెండు ఉచిత వ్యాక్సిన్లను వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ప్రైవేటు ఆసుపత్రులు అందించనున్నాయి. ఫైజర్ బయో ఎన్ టెక్ అలాగే సినోఫామ్ వ్యాక్సిన్లు అవసరమైనవారికి అందనున్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన విషయమై ఆయా ఆసుపత్రుల వివరాల్ని దుబాయ్ హెల్త్ అథారిటీ వెల్లడించగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయమై కొన్ని ఆసుపత్రులు పూర్తిస్థాయి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాయి. డిహెచ్ఎ ద్వారా వ్యాక్సినేషన్ పొందాలనుకునేవారు అథారిటీకి చెందిన యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. అయితే, ప్రైవేటు సెక్టార్ ఆసుపత్రుల విషయానికొస్తే, బుకింగ్ కోసం రకరకాల ఆప్షన్స్ అందుబాటులో వున్నాయి. ఎన్ఎంసి రాయల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం డిహెచ్ఎ వాట్సాప్(+971800342) లేదా టోల్ ఫ్రీ నెంబర్ 800432 ద్వారా లేదా ఆసుపత్రికి చెందిన ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్ ద్వారా అలాగే అపాయింట్మెంట్ డెస్క్ వద్ద సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ విధానంలో అపాయింట్మెంట్ బుక్ అవుతుంది, ఆ విషయాన్ని ఎస్ఎంఎస్ రూపంలో ఆయా వ్యక్తులకు చేరవేయబడుతుంది. ఆ తర్వాత కన్సెంట్ ఇవ్వవలసి వుంటుంది. నర్స్, ఆ వివరాల్ని పరిశీలిస్తుంది. ఉష్ణోగ్రత, పల్స్ అలాగే రక్తపోటు వంటివాటిని పరిశశీలించడం జరుగుతుంది. అన్నీ సక్రమంగా వుంటే ప్రీ వ్యాక్సిన్ అస్సెస్మెంట్ కోం అనుమతిస్తారు. పూర్తిస్థాయి మెడికల్ హిస్టరీ ఇక్కడ తీసుకోబడుతుంది. ఆ తర్వాత హసానా సిస్టమ్ లోకి ఎంటర్ అవుతారు. వ్యాక్సిన్ విధానాన్ని నర్స్, ఆయా వ్యక్తులకు వివరిస్తారు. వ్యాక్సిన్ పేరు వంటి వివరాల్ని తెలియజేస్తారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత 15 నిమిషాలు పరిశీలనలో వుంచుతారు.సైడ్ ఎఫెక్ట్స్ వంటి వివరాల గురించి చెబుతారు. రెండో వ్యాక్సిన్ విషయమై కూడా సమాచారం చెబుతారు.అన్ని వివరాలూ హోసన్ యాప్ ద్వారా వినియోగదారులు తెలుసుకోవచ్చు.చాలా హెల్త్ కేర్ సెంటర్లు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







