కారు బాంబుల దాడి : టర్కీ

- March 04, 2016 , by Maagulf
కారు బాంబుల దాడి : టర్కీ

కుర్దిష్‌ మిలిటెంట్లు జరిపిన రాకెట్‌, కారు బాంబుల దాడిలో శుక్రవారం ఇద్దరు పోలీసులు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని మర్దిన్‌ రాష్ట్రంలో ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక భద్రతాదళాలు మీడియాకు తెలిపాయి. సిరియా సరిహద్దుల్లో ఉన్న నుసాయ్‌బిన్‌ టౌన్‌లో కుర్దిస్థాన్‌ వర్కర్స్‌పార్టీ(పీకేకే) ఈ దాడికి పాల్పడిందని చెప్పాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చెయ్యలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com