ఒమాన్ లో ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టిన విద్యార్ధులు

- March 04, 2016 , by Maagulf
ఒమాన్ లో  ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టిన విద్యార్ధులు

గురువుగారి ఇంట్లో ఎలుక ఉందని...ఎంతకీ దొరకని దాన్ని ఎలాగైనా చంపాలని ఏకం గా కొంపకు నిప్పు పెట్టారు నాటి  పాతకాలం పరమానందయ్య శిష్యులు..అసలు చదువు చెప్పేవారే లేకపోతే మనకు బడిలో ఎదురు ఉండదని బహుశా భావించేరేమో నేటి తరం ఆ గడుగ్గాయులు.....ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టి రాయల్ ఒమాన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. సోహార్ లోని ఒక పాఠశాలకు చెందిన అయిదుగురు ఉపాధ్యాయిని గదిని  అగ్నికి ఆహుతి చేయబోయారు. ఈ విషయాన్ని పోలీసులకు  కొందరు తెలియడంతో రాయల్ ఒమాన్ పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. కాగా అరెస్ట్ కాబడిన ఐదుగురు విద్యార్థులు తాము రోజూ సాయంత్రం పాఠశాలలో  తలదాచుకునేవారమని 'గాసోలిన్' ఉపయోగించి అగ్ని  రాజేసి ఉపాధ్యాయుల గదికి ముట్టించినట్లు వారు అంగీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com