5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు

- March 04, 2016 , by Maagulf
5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు

అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ర్టాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అస్సాంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అస్సాంలో తొలి దశకు ఏప్రిల్ 4న, రెండో దశకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లో ఆరు దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 4, 11, 17, 21, 25, 30, మే 5వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, పుదుచ్చురి, తమిళనాడు రాష్ర్టాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ర్టాలకు మే 16న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ర్టాల్లోనూ మే 19న ఓట్లను లెక్కిస్తారు.ఎన్నికల ప్రక్రియ మే 21వ తేదీలోపు ముగుస్తుందని సీఈసీ జైదీ అన్నారు. నోటా సింబల్ ఎన్నికల కోడ్ వెంటనే అమలులోకి వస్తుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ నసీమ్ తెలిపారు. తొలిసారి ఎన్నికల్లో నోటాకు సింబల్‌ను కేటాయించారు. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ డిజైన్ నోటా గుర్తును డిజైన్ చేసింది. అయిదు రాష్ర్టాల్లో మొత్తం 17 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈవీఎం మెషిన్లపై అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయి. అయిదు రాష్ర్టాల్లో మొత్తం 824 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఓటర్ల సౌకర్యం కోసం పోలింగ్ స్టేషన్లను పెంచారు. ప్రతి జిల్లాకు అయిదుగురు కేంద్ర అబ్జర్వర్లు ఉంటారు. ఫ్లయింగ్ స్కాడ్‌లు, మొబైల్ టీమ్‌లకు జీపీఎస్ సౌకర్యం కల్పిస్తున్నారు. పెయిడ్ న్యూస్‌పై ఎన్నికల సంఘం నిఘా పెడుతుందని సీఈసీ నసీమ్ జైదీ తెలిపారు. కొత్త తరహా ఐటీ అప్లికేషన్లను ఎన్నికల సంఘం వాడనున్నట్లు జైదీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com