కాజల్-ధనుష్ మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు...
- March 04, 2016
సూపర్ మాస్ హీరో ధనుష్-సూపర్ బ్యూటి కాజల్ జంటగా నటించగా తమిళంలో మంచి విజయం సాధించిన "మారి" అనే చిత్రం తెలుగులో "మాస్" పేరుతో అనువాదమవుతోంది. "వి. ఎం. అర్" సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. "లవ్ ఫెయిల్యూర్" ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి "వై దిస్ కొలవేరి ఫేం" అనిరుధ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. "ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం "మాస్" చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.
మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది" అన్నారు. విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రసన్న జి.కె, సినిమాటోగ్రఫి: ఓంప్రకాష్, మాటలు-పాటలు: సాహితి, సంగీతం: అనిరుధ్, సమర్పణ: "వి.ఎం.ఆర్", నిర్మాత: వాసిరెడ్డి పద్మాకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్ !!
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







