జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం పోటీ....

- March 04, 2016 , by Maagulf
జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం  పోటీ....

 యోగాపై పాట కట్టండి.. 5 లక్షలు గెలవండి. ఇదో కాంటెస్ట్. కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీకి ఆహ్వానాలు కోరుతోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం కోసం ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఎంట్రీని విజేతగా ప్రకటిస్తారు. ఆ విన్నర్‌కు అయిదు లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. వ్యక్తి లేదా గ్రూప్ ఎవరైనా యోగాపై 3 నుంచి 5 నిమిషాలు ఉండే సాంగ్‌ను పోటీకి పంపవచ్చు. ఎంపీ3 ఆడియో ఫార్మాట్‌లో ఉండే ఆ సాంగ్ సైజ్ 5ఎంబీ దాటకూడదు. పోటీలో పాల్గొనేవాళ్లు [email protected] వెబ్‌సైట్‌కు తమ పాటను మెయిల్ చేయాలి. మార్చి 31వ తేదీలోపు ఆ సాంగ్‌ను పంపాలి. మరిన్ని వివరాలకు ఆయుష్ (www.indiamedicine.nic.in) వెబ్‌సైట్‌ను చూడండి.
సాంగ్ హిందీ భాషలో ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com