మహేశ్ ఇచ్చిన వాయిస్‌తోనే సూపర్‌స్టార్ కృష్ణ, సినిమా ప్రారంభం..

- March 04, 2016 , by Maagulf
మహేశ్ ఇచ్చిన వాయిస్‌తోనే సూపర్‌స్టార్ కృష్ణ, సినిమా ప్రారంభం..

సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల కీలక పాత్రధారులుగా ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీ శ్రీ'. సాయిదీప్‌ చాట్ల, వై.బాలు రెడ్డి, షేక్‌ సిరాజ్‌ నిర్మాతలు. విడుదలకు సిద్ధమౌతున్న ఈ చిత్రంలో కుటుంబ సభ్యులు నరేశ్, సుధీర్‌బాబు, సుధీర్‌బాబు రెండో తనయుడు మాస్టర్‌ దర్శన్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే 'శ్రీ శ్రీ' ఆడియోకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియో విడుదల చేసిన మహేశ్.. ఈ సినిమాకోసం మరో అడుగు ముందుకేసి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మహేశ్ ఇచ్చిన వాయిస్‌తోనే సినిమా ప్రారంభం అవుతుందని టాక్. కృష్ణ హీరోగా వున్న చిత్రాల్లో మహేశ్ బాలనటుడిగా ఓనమాలు దిద్దుకుని.. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా ఎదిగాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com