ఇంటి వద్దకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఫ్రీ డెలివరీ
- May 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ పెరుగుతున్న దృష్ట్యా హెల్త్ కేర్ సిస్టమ్‌పై కేసుల తీవ్రత ఎక్కువైపోయింది. కేస్ లోడ్ పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సట్రేటర్లు, హాస్పిటల్ బెడ్స్ కొరత ఏర్పడింది.అంతేకాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మెడిసిన్ కొరత కూడా కనిపిస్తుంది.
ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు ఆక్సిజన్ కాన్సట్రేటర్ అందించేందుకు ఓలా మంచి నిర్ణయమే తీసుకుంది. సదరు కంపెనీ డొనేషన్ ప్లాట్ ఫాం అయినటువంటి GiveIndia తో పార్టనర్ అయి 10వేల ఆక్సిజన్ కాన్సట్రేటర్లను హోం డెలివరీ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా ఉచితంగానే.
అదే విషయాన్ని ట్వీట్లో అనౌన్స్ చేశారు ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవీశ్ అగర్వాల్.. ‘మన కమ్యూనిటీలను కాపాడుకునేందుకు అంతా కలిసికట్టుగా ఉండాలి.ఇవాళ ఇండియా కోసం అవసరమున్న వారికి ఆక్సిజన్ ను ఉచితంగా అందిస్తాం’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
కాన్సట్రేటర్లు డెలివరీ చేయడంతో పాటు..పర్సన్స్ దగ్గర్నుంచి అవే మెషీన్లను అవసరం అయిపోయాక తిరిగి కలెక్ట్ చేసుకుంటుంది కూడా. ఓలా యాప్ లో ఆక్సిజన్ కాన్సట్రేటర్ల కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకసారి వాలిడేట్ అయితే ఇంటి వద్దకే డెలివరీ, పికప్ చేస్తామని భవీశ్ అగర్వాల్ అన్నారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







