నిబంధనలు అతిక్రమిస్తే కేసులు: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
- May 11, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసరించి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రేపటి నుండి పది రోజులపాటు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అమలుపై డీజీపీ మంగళవారం రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్లు, ఎస్పీల నుండి డీఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
లాక్‌డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏ విధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణా విషయంలో కూడా ఏ విధమైన ఆంక్షలు లేవన్నారు. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్‌డౌన్ నుండి మినహాయించారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు.
కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్‌కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని తెలిపారు.నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలన్నారు.లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్పీలు పాసులను జారీ చేస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







