నిరుద్యోగులకు 15 నెలల పాటు నగదు సాయం
- May 16, 2021
సౌదీ: ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్న యువతకు చేదోడుగా ఉండేందుకు నిరుద్యోగభృతి అందించనుంది సౌదీ ప్రభుత్వం. సౌదీ మంత్రి మండలి నిర్ణయం మేరకు అర్హులైన వారికి 15 నెలల పాటు ఆర్ధిక సాయం అందించనుంది. నిరుద్యోగభృతి సాయాన్ని నాలుగు కేటగిరిలుగా విభజించింది ప్రభుత్వం.లబ్ధిదారులకు తొలి నాలుగు నెలలు SR2,000 చొప్పున సాయం అందిస్తారు. ఆ తర్వాతి నాలుగు నెలలు SR1,500, ఆ తర్వాతి నాలుగు నెలలు SR1,000 చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. ఇక చివరి మూడు నెలలు SR 750 చొప్పున నిరుద్యోగభృతి అందుతుంది.ఉద్యోగం పొందలేకపోయిన 20-40 ఏళ్ల మధ్య ఉన్న యువతీ, యువకులు నిరుద్యోగభృతికి అర్హులు.
గమనిక: ఈ అవకాశం సౌదీ పౌరులు మరియు శాశ్వత నివాసితులకు మాత్రమే
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







