'తనికాట్టు రాజా' వందెకరాల్లో షూటింగ్..
- March 05, 2016
వందకోట్లతో తెరకెక్కిన సినిమాలను చూశాం.. వందల కోట్లు కొల్లగొట్టిన సినిమాలనూ చూస్తున్నాం. వందెకరాల్లో ఓ సినిమా షూటింగ్ చేయడం చాలా అరుదు. ప్రస్తుతం ఓ తమిళ చిత్రం పేరిట ఈ రికార్డు నమోదవనుంది. సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై 'మంజాపై' (తెలుగులో 'ఎర్రబస్సు' పేరుతో రీమేక్ చేశారు) ఫేమ్ రాఘవన్ దర్శకత్వంలో ఆర్య, కేథరిన్ థెరిసా హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న కొత్త చిత్రం షూటింగ్ 100 ఎకరాల స్థలంలో మొదలవనున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. దిండుగల్ జిల్లా తాండికుడి అనే గ్రామంలోని వంద ఎకరాల ఖాళీ స్థలంలో వేసిన సెట్‌లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జరుగనుందిట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రానికి 'తనికాట్టు రాజా' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.ఇది రజనీకాంత్ నటించిన పాత చిత్రం టైటిల్ కాగా, అది అవాస్తవమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యువన శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకీ వందెకరాల్లో ఆర్య, కేథరిన్ ఏం చేస్తారబ్బా..?!
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







