యూఏఈ పారిశ్రామిక చట్టంలో మార్పులు..100% విదేశీ పెట్టుబడులకు అనుమతి

- May 20, 2021 , by Maagulf
యూఏఈ పారిశ్రామిక చట్టంలో మార్పులు..100% విదేశీ పెట్టుబడులకు అనుమతి

యూఏఈ: దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా యూఏఈ తీసుకొచ్చిన పారిశ్రామిక, వాణిజ్య సంస్థ చట్ట సవరణ విధానం జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ చట్ట సవరణ మేరకు విదేశీ పెట్టుబడిదారులు 100% ఇన్వెస్ట్ చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఆన్ షోర్ కంపెనీ యాజమాన్య చట్టాలకు సంబంధించి గతేడాది నవంబర్ ముందు వరకు ఓ కంపెనీలో మెజారిటీ షేర్ హోల్డర్ లు యూఏఈ జాతీయులకే చెంది ఉండాలి. అయితే...విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఈ నిబంధనను కంపెనీ యాజమాన్య చట్టం నుంచి గత నవంబర్ లో తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాదు..ఓ కంపెనీలో బోర్డులో మెజారిటీ సభ్యులు యూఏఈ వారే ఉండాలని, అధ్యక్షత బాధ్యతలు కూడా యూఏఈకి చెందిన వ్యక్తులకే ఇవ్వాలనే నిబంధనను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ యాజమాన్య చట్టంలో చేసిన ఈ సవరణలతో జూన్ 1 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తామే సొంతంగా కంపెనీ పెట్టుకొని తమ యాజమాన్యంలోనే కంపెనీ నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com