వ్యాక్సినేటెడ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెబ్ సైట్

- May 20, 2021 , by Maagulf
వ్యాక్సినేటెడ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెబ్ సైట్

సౌదీ: కోవిడ్ నేపథ్యంలో సౌదీ వచ్చే ప్రయాణికులు నిర్ణీత నిబంధనలు, ఆంక్షలు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే..ప్రయాణికుల ఎంట్రీని సులభతరం చేసేలా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అమలు చేస్తున్న సౌదీ ప్రభుత్వం లేటెస్ట్ గా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు, వ్యాక్సిన్ నుంచి మినహాయింపు వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ దేశాల నుంచి కింగ్డమ్ కు వచ్చే సౌదీయేతర ప్రయాణికులు...తమ వ్యాక్సినేషన్ వివరాలను  https://muqeem.sa/#/vaccine-registration/home లింక్ ద్వారా వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే వ్యాక్సిన్ నుంచి మినహాంపు ఉన్న వర్గాల వారు కూడా ప్రయాణానికి ముందు ఈ లింక్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ తవక్కల్నా యాప్ కు అనుసంధానం అయి ఉంటుంది. దీంతో ప్రయాణికుల రాకకు సంబంధించిన ప్రక్రియ సులభతరం అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com