వ్యాక్సినేటెడ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెబ్ సైట్
- May 20, 2021
సౌదీ: కోవిడ్ నేపథ్యంలో సౌదీ వచ్చే ప్రయాణికులు నిర్ణీత నిబంధనలు, ఆంక్షలు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే..ప్రయాణికుల ఎంట్రీని సులభతరం చేసేలా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అమలు చేస్తున్న సౌదీ ప్రభుత్వం లేటెస్ట్ గా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు, వ్యాక్సిన్ నుంచి మినహాయింపు వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ దేశాల నుంచి కింగ్డమ్ కు వచ్చే సౌదీయేతర ప్రయాణికులు...తమ వ్యాక్సినేషన్ వివరాలను https://muqeem.sa/#/vaccine-registration/home లింక్ ద్వారా వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే వ్యాక్సిన్ నుంచి మినహాంపు ఉన్న వర్గాల వారు కూడా ప్రయాణానికి ముందు ఈ లింక్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ తవక్కల్నా యాప్ కు అనుసంధానం అయి ఉంటుంది. దీంతో ప్రయాణికుల రాకకు సంబంధించిన ప్రక్రియ సులభతరం అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







