తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

- May 20, 2021 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.ఇక మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది.అయితే, గత 9 రోజులుగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నది.ఇక ఇదిలా ఉంటె,కరోనాతో పాటుగా ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి ఇబ్బందులు పెడుతున్నది.కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్ కనిపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.తెలంగాణ ప్రభుత్వం ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధిని నోటిఫియాబుల్ డిసీజ్ గా ప్రకటించింది.రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల గురించి సమాచారం ఇవ్వాలని ప్రకటించింది.ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com