ప్రైవేట్ స్కూల్స్ లో అరబిక్, ఇస్లామిక్ ఎడ్యూకేషన్ తప్పనిసరి చేసిన ఖతార్

- May 20, 2021 , by Maagulf
ప్రైవేట్ స్కూల్స్ లో అరబిక్, ఇస్లామిక్ ఎడ్యూకేషన్ తప్పనిసరి చేసిన ఖతార్

ఖతార్: దేశంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ఇక నుంచి అరబిక్, ఇస్లామిక్ విద్య, ఖతార్ చరిత్ర సిలబస్ లో తప్పనిసరిగా బోధించాలని ఖతార్ విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు అకాడమిక్ పాలసీ-2021 ను అప్ డేట్ చేసింది. ప్రతీ ప్రైవేట్ స్కూల్, కిండర్ గార్టెన్ లో ఈ మూడు సబ్జెక్టులు బోధనాంశాలుగా ఉండాలని విద్య, ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ స్కూల్స్, కిండర్ గార్టెన్ యాజమాన్యాలకు ఉత్తర్వ్యులు జారీ చేసింది. అన్ని ప్రీ స్కూళ్లలో అరబిక్ భాషతో పాటు ఇస్లామిక్ విద్య ఈ రెండు సబ్జెక్టులు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వ్యుల్లో స్పష్టం చేసింది. ఇక ఉన్నత విద్యలో అరబిక్, ఇస్లామిక్ విద్యతో పాటు ఖతార్ చరిత్ర...ఈ మూడు సబ్జెక్టులు ఉండాలని వెల్లడించింది. గ్రేడ్ 1 నుంచి 12 వరకు పైన పేర్కొన్న అంశాలు విద్యావిధానంలో తప్పనిసరిగా చేర్చాలని ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com