వ్యాక్సినేషన్ లో టాప్ గా నిలిచిన యూఏఈ
- May 22, 2021
యూఏఈ: కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్ని తమ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కొన్ని దేశాలు వడివడిగా దూసుకెళ్తుండగా..కొన్ని దేశాల్లో మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. అయితే..కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి గ్లోబల్ ర్యాకింగ్స్ లో ఇతర దేశాలతో పోలిస్తే యూఏఈ టాప్ గానిలిచింది. స్థానిక ప్రభుత్వ సమాచారం, ప్రధాన పత్రికల ద్వారా సేకరించిన వివరాలు, వరల్డ్ బ్యాంక్ పాపులేషన్ మేజర్మెంట్స్(మొత్తం జనాభాలో వ్యాక్సిన్ తీసుకున్న వారి శాతం) ఇలా పలు మార్గాల ద్వారా సేకరించిన డేటాతో ర్యాకింగ్స్ ను ఇచ్చారు. ఇందులో ఎమిరాతి ప్రథమ స్థానం దక్కించుకోగా, బహ్రెయిన్, అరుబ, చిలి టాప్ ఫైవ్ లోని చోటు దక్కించుకున్నాయి. గత డిసెంబర్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన యూఏఈ ఇప్పటివరకు 11.9 మిలియన్లో డోసులు ఇచ్చింది. గత శుక్రవారం ఒక్క రోజే 1,22,001 డోసుల వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు అబుధాబిలో 12 ఏళ్లకు పైబడిన వారికి కూడా ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ఇస్తుండటంతో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మరింత ముమ్మరం కానున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







