తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్ పొడిగింపు
- May 22, 2021
చెన్నై: తమిళనాడులో ఇప్పటికీ కొవిడ్ వ్యాప్తి అదుపులోకి రాని నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మే 24 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే. మరో రెండ్రోజుల్లో ఆ లాక్ డౌన్ ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కాగా, తమిళనాడులో నిన్న వెలువడిన బులెటిన్ లో 36,184 కేసులు, 467 మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుంచి కేసులు పెరుగుతుండడంతో డీఎంకే ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా లాక్ డౌన్ లోనూ అత్యవసర సర్వీసులకు మినహాయిపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







