భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదురోజుల అమెరికా పర్యటన..
- May 24, 2021
న్యూ ఢిల్లీ: ఐదురోజుల పాటు పర్యటన కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్.కె. జైశంకర్ అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో, విదేశాంగ మంత్రి అమెరికన్ వ్యాక్సిన్ తయారీ దారులతో సమావేశం అవుతారు.ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్లను భారతదేశం పొందేందుకు మార్గాలను సుగమం చేసే అవకాశం ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బిడెన్ మాట్లాడుతూ అమెరికా అవసరమైన దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తుందని చెప్పారు. జైశంకర్ ఈ 5 రోజుల అమెరికా పర్యటన దీనికి అనుసంధానంగానే ఉంటుందని చెబుతున్నారు.
మే 24 నుంచి 28 వరకు భారత v విదేశాంగ మంత్రి యుఎస్‌ను సందర్శించనున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ను కలిసే అవకాశం ఉంది. వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో కూడా జైశంకర్ సమావేశం అవుతారు. ఇండో-యుఎస్ ఆర్థిక, కోవిడ్‌కు సంబంధించిన అంశాలపై విదేశాంగ మంత్రి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (USISPF), యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) లతో చర్చలు జరపనున్నారు. ఇవే కాకుండా, ఆయన ఫార్మా కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు.ఈ మేరకు భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ఓ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







