ఇంటి అద్దెల్లో తగ్గుదల లేదెందుకు?
- March 05, 2016
దుబాయ్ మార్కెట్‌లో ఇంటి అద్దెలు తగ్గుతాయని పలు అంచనాలు వెల్లడించాయి. మార్కెట్‌లోకి 8000 నుంచి 20000 వరకు కొత్త యూనిట్లు రావడంతో, ఇప్పటికే ఉన్న ఇంటి అద్దెలు తగ్గుతాయని భావించారు. మార్కెట్‌లోనూ డల్ కండిషన్స్ ఇంటి అద్దెలు తగ్గడానికి సానుకూలమని అంచనా వేయడం జరిగింది. కానీ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇంటి అద్దెల్లో ఎలాంటి తగ్గుదల నమోదు కాకపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కారణాల్ని విశ్లేషించి చూస్తే, కొత్త ఇంటి అద్దెలకు సంబంధించి హిడెన్ కాస్ట్ పట్ల అద్దె ఇళ్ళ కోసం వెతుకుతున్నవారు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తద్వారా ఉన్న ఇళ్ళలోంచి మారడానికి వారు ఇష్టపడటంలేదు. ఇంటి అద్దెలకు సంబంధించి ప్రపంచ మార్కెట్‌లో తగ్గిన ముడి చమురు ధరలు కూడా ఎలాంటి ప్రభావం చూపడంలేదు. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్టడీగా ఉందని ఈ రంగంలోని నిపుణులు చెప్పారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









