కరోనా పై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు...
- May 24, 2021
హైదరాబాద్: కరోనా కట్టడి చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని ఆదేశించారు.కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు.రాష్ట్రంలో ఫీవర్ సర్వే అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని సీఎం తెలిపారు. రాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్ల సంఖ్య పెంచాలన్నారు. బ్లాక్ ఫంగస్‌కు మందుల్ని తక్షణమే సమకూర్చుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. కరోనా అనుమానితులకు టెస్టులను నిరాకరించకూడదని, ప్రాథమిక వైద్యకేంద్రాలకు వచ్చే వారందరికీ టెస్టులు చేయాలని ఆదేశించారు. రాపిడ్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని, వైద్య కేంద్రాల్లో సరిపడా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కరోనా కట్టడి విషయంలో ఎంతటి ఖర్చుకైనా వెనకాడొద్దన్నారు.పోలీస్, వైద్యారోగ్యశాఖలకు బడ్జెట్ పెంచాలని చెప్పారు. ఢిల్లీలాంటి చోట్ల చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాలని కేసీఆర్ సూచించారు. అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తిని 600 ఎంటీలకు పెంచాలని, సెకండ్ డోస్ కోసం సరిపడా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కేసీఆర్ చెప్పారు.
ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషన్లరు అంజనీకుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి, హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు, సిఎం వోఎస్డీ గంగాధర్, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, , డిఎంఈ రమేష్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, కరోనా టాస్కఫోర్స్ మెంబర్లు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, రyనాల్డ్ రాస్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







