వేడి, ఒత్తిడి నుండి కార్మికులకు రక్షణ : ఖతార్ నిర్ణయానికి ప్రపంచ వ్యాప్త ప్రశంసలు
- May 27, 2021
ఖతార్: గల్ఫ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గత కొద్ది రోజుల నుండి గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు ఉష్ణోగ్రత, అలాగే ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించేందుకు ఖతార్ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. మినిస్ర్టీ ఆఫ్ అడ్మినిస్ర్టేటివ్ డెవలప్ మెంట్ లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ పట్ల కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా ఈ రూల్స్ పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మే 26 న విడుదల చేసిన కొత్త రూల్స్ ప్రకారం, ఉదయం 10 గంటల నుంచి, మధ్యాహ్నం 2.30 నిముషాల వరకూ ఎండ నేరుగా తగిలే బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పని చేయకూడదు. జూన్ 1 నుండి, సెప్టెంబర్ 15 వరకూ ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. 2007 లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉదయం 11.30 నిముషాల నుండి, మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ అమల్లో ఉండేది. జూన్ 15 నుండి, ఆగస్టు 31 వరకూ ఈ నిబంధన అమలయ్యేది. కాగా, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం నేపథ్యంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఆయా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







