తెలంగాణ ఈ-పాస్ వివరాలు...
- May 27, 2021
హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.అత్యవసర ప్రయాణాలు చేయాలంటే ఈ-పాస్ తప్పనిసరి. దానికోసం https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. వైద్య సేవలు, వివాహాలు, మరణాలకు మాత్రమే పోలీసులు తక్షణం ఈ-పాస్ జారీ చేస్తుండగా.. సరైన కారణాలు లేకపోయినా.. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకున్నా వెంటనే తిరస్కరిస్తున్నారు. అటు రైలు, విమాన ప్రయాణాలు చేసేవారు ఎలాంటి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
E-Pass కోసం తెలంగాణ వాసులు ఇలా చేయండి..
1. మొదటిగా https://policeportal.tspolice.gov.inవెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
2. మీరు కంటైన్మెంట్ జోన్‌లో లేనట్లు.. అలాగే కంటైన్మెంట్ ప్రాంతానికి ప్రయాణించట్లేదని ధృవీకరించాలి.
3. ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేనట్లు, సమర్పించిన వివరాలన్నీ కూడా నిజమైనవేనని సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి.
4. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో సూచించిన విధంగా అన్ని వివరాలను నమోదు చేయాలి.
5. పేరు,చిరునామా, వాహనం నెంబర్, సీటింగ్ సామర్థ్యం, ప్రయాణించే తేదీ, తిరుగు ప్రయాణ తేదీ, ఏ రూట్లో వెళ్లి వస్తారో తదితర కాలమ్స్ అన్ని పూర్తి చేయాలి.
6. చివరిగా మీ ఫొటో,ఆధార్,రీజన్ ఆఫ్ ట్రావెలింగ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







