వేడి, ఒత్తిడి నుండి కార్మికులకు రక్షణ : ఖతార్ నిర్ణయానికి ప్రపంచ వ్యాప్త ప్రశంసలు

- May 27, 2021 , by Maagulf
వేడి, ఒత్తిడి నుండి కార్మికులకు రక్షణ : ఖతార్ నిర్ణయానికి ప్రపంచ వ్యాప్త ప్రశంసలు

ఖతార్: గల్ఫ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గత కొద్ది రోజుల నుండి గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు ఉష్ణోగ్రత, అలాగే ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించేందుకు ఖతార్ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. మినిస్ర్టీ ఆఫ్ అడ్మినిస్ర్టేటివ్ డెవలప్ మెంట్ లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ పట్ల కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా ఈ రూల్స్ పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మే 26 న విడుదల చేసిన కొత్త రూల్స్ ప్రకారం, ఉదయం 10 గంటల నుంచి, మధ్యాహ్నం 2.30 నిముషాల వరకూ  ఎండ నేరుగా తగిలే బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పని చేయకూడదు. జూన్ 1 నుండి, సెప్టెంబర్ 15 వరకూ ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. 2007 లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉదయం 11.30 నిముషాల నుండి, మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ అమల్లో ఉండేది. జూన్ 15 నుండి, ఆగస్టు 31 వరకూ ఈ నిబంధన అమలయ్యేది. కాగా, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం నేపథ్యంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.  ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఆయా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com