లోన్ చెల్లింపులపై రిలీఫ్..ఈఎంఐ చెల్లింపులు వాయిదా
- May 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ తో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బ్యాంక్ లోన్లు రుణగ్రహీతలకు అదనపు భారం కాకుండా బహ్రెయిన్ ప్రభుత్వం మరోసారి మారటోరియం ప్రకటించింది బహ్రెయిన్. ఆరు నెలల పాటు రుణాల ఈఎంఐ వసూళ్లను వాయిదా వేస్తూ నిర్ణయించింది. కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ దేశంలోని అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు మారటోరియం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అంటే 6 నెలల పాటు లోన్ వాయిదాల చెల్లింపులు వాయిదా వేసుకోవచ్చు. ఈ మారటోరియం కాలానికి సంబంధించి ఎలాంటి ఆలస్యం రుసుములు, అదనపు ఛార్జీలు, వడ్డీలు ఉండవు. అలాగే వాయిదాల సంఖ్యను పెంచొద్దని, అయితే..వాయిదా వ్యవధిని బట్టి రుణాలపై వర్తించే వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగుతాయిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







