మైనర్ పిల్లల పేరిట తల్లులు బ్యాంక్ ఖాతా తీసుకోవచ్చన్న SAMA
- May 29, 2021
సౌదీ: మహిళల సాధికారిత లక్ష్యంగా ఇప్పటికే పలు కీలక సంస్కరణలు చేపట్టిన సౌదీ ప్రభుత్వం...పిల్లల బ్యాంక్ అకౌంట్ల విషయంలోనూ తల్లులకు ప్రాధాన్యత కల్పించింది. సంతానం పేరు మీద తల్లులు బ్యాంక్ అకౌంట్ ఒపెన్ చేయవచ్చని సౌదీ మానేటరీ అథారిటీ-SAMA స్పష్టం చేసింది. మైనార్టీ తీరే వరకు తల్లుల అకౌంట్ కు పిల్లల బ్యాంక్ అకౌంట్ అనుసంధానమై ఉంటుంది. అంటే తమ సంతానం పేరు మీద తీసుకునే అకౌంట్ కు తల్లులు అధికారిక సంరక్షకులుగా ఉంటారు. కుటుంబ వ్యవస్థలో మాతృమూర్తులను మరింత శక్తివంతం చేసేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే...పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే తల్లులు ఖాతా తెరిచేందుకు భర్తను తీసుకురావాలి. లేదంటే కోర్టు అనుమతి తీసుకోవాలని SAMA వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాకింగ్ వ్యవస్థలో మహిళల ప్రాధాన్యతను పెంపొందించేలా సౌదీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ఇతర దేశాలతో మహిళ ప్రాధాన్యత రేటు పోల్చుకుంటే 100కుగాను సౌదీ 80 స్కోరు సాధించింది. గతేడాది ఈ స్కోరు 70.6గా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







