భార్య కళ్లెదుటే కోవిడ్ పేషెంట్ ఆత్మహత్య

- May 29, 2021 , by Maagulf
భార్య కళ్లెదుటే కోవిడ్ పేషెంట్ ఆత్మహత్య

యూఏఈ: జీవితాలను నాశనం చేస్తున్న కోవిడ్ మహమ్మారి మరో కుటుంబంలో తీరని విషాదం నింపింది. కోవిడ్ బారిన పడిన ఓ వ్యక్తి భయంతో భార్య కళ్లెదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అజ్మన్ లోని రవ్డా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు ఇటీవలె కోవిడ్ బారిన పడినట్లు అతని భార్య పోలీసుల విచారణలో వెల్లడించింది. ఐదు రోజుల చికిత్స తర్వాత అతనికి ట్రాకింగ్ బ్యాండ్ వేసిన అధికారులు..గడువు ముగిసే వరకు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అయితే...సడెన్ హోం క్వారంటైన్ నిబంధనలను బ్రేక్ చేసిన అతను...కారులో తనను బయటికి తీసుకెళ్లాడని, రవ్డా బ్రిడ్జి మధ్యలో కారు నిలిపివేసి కాసేపు మౌనంగా కూర్చున్నారని భర్త ఆత్మహత్యకు ముందు జరిగిన సిచ్యువేషన్ ను ఆమె వివరించింది. కొద్దిసేపటి మౌనం తర్వాత పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి..గుడ్ బై అంటూ ఒక్కసారిగా  కారులోంచి దిగి బ్రిడ్జిపై నుంచి దూకినట్లు తెలిపింది. ఈ ఘటనలో బాధితుడు స్పాట్ లోనే మృతిచెందాడు. తాను కోవిడ్ తో భయపడ్డాడని, జాబ్ పోతుందనే ఆందోళన తనలో ఎక్కువైందని భర్త మానసిక ఆవేదనను ఆమె పోలీసులకు చెప్పింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com