భార్య కళ్లెదుటే కోవిడ్ పేషెంట్ ఆత్మహత్య
- May 29, 2021
యూఏఈ: జీవితాలను నాశనం చేస్తున్న కోవిడ్ మహమ్మారి మరో కుటుంబంలో తీరని విషాదం నింపింది. కోవిడ్ బారిన పడిన ఓ వ్యక్తి భయంతో భార్య కళ్లెదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అజ్మన్ లోని రవ్డా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడు ఇటీవలె కోవిడ్ బారిన పడినట్లు అతని భార్య పోలీసుల విచారణలో వెల్లడించింది. ఐదు రోజుల చికిత్స తర్వాత అతనికి ట్రాకింగ్ బ్యాండ్ వేసిన అధికారులు..గడువు ముగిసే వరకు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అయితే...సడెన్ హోం క్వారంటైన్ నిబంధనలను బ్రేక్ చేసిన అతను...కారులో తనను బయటికి తీసుకెళ్లాడని, రవ్డా బ్రిడ్జి మధ్యలో కారు నిలిపివేసి కాసేపు మౌనంగా కూర్చున్నారని భర్త ఆత్మహత్యకు ముందు జరిగిన సిచ్యువేషన్ ను ఆమె వివరించింది. కొద్దిసేపటి మౌనం తర్వాత పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి..గుడ్ బై అంటూ ఒక్కసారిగా కారులోంచి దిగి బ్రిడ్జిపై నుంచి దూకినట్లు తెలిపింది. ఈ ఘటనలో బాధితుడు స్పాట్ లోనే మృతిచెందాడు. తాను కోవిడ్ తో భయపడ్డాడని, జాబ్ పోతుందనే ఆందోళన తనలో ఎక్కువైందని భర్త మానసిక ఆవేదనను ఆమె పోలీసులకు చెప్పింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







