భారతీ ఎయిర్‌టెల్ ఓ సరికొత్త ఆఫర్
- March 06, 2016
ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం నిత్యావసరంగా మారింది. దీంతో టెలికాం ఆపరేటర్లు కూడా ఆసక్తికరమైన ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లలో కార్పొరేట్ ప్లాన్‌ల్లో ఉన్నవారికి ఆయా సంస్థలు తక్కువ డేటాను అందజేస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ వాడాలనుకుంటే మరో నెంబర్‌ను వినియోగించాల్సి వస్తోంది. ఇకమీదట పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ప్రీపెయిడ్ డేటా రీఛార్జిలు చేసుకునే సదుపాయాన్ని ఎయిర్‌టెల్ కల్పిస్తోంది. డేటా బ్యాలెన్స్ కావాలనుకునే వినియోగదారులు.. తమకు కావాల్సిన డేటా ఆఫర్‌తో రీఛార్జి చేసుకొని ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆ సంస్థ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శ్రీనివాసన్ గోపాలన్ ప్రకటించారు. ఈ రీఛార్జిలు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నాయట.
తాజా వార్తలు
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్







