భక్త కన్నప్ప గా ప్రభాస్ నటిస్తేనే అందం..
- March 06, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చారిత్రక చిత్రాలు వచ్చాయి. వీటిలో శివభక్తుడు అయిన భక్త కన్నప్ప చాలా మంచి ఆధరణ పొందింది. పాత చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఎంతో గొప్పగా నటించారు. తర్వాత రెబల్ స్టార్ కృష్ణం రాజు భక్తకన్నప్ప పాత్రలో జీవం పోశారు. ఆయన కెరీర్ లో ఈ చిత్రం ఎంతో గొప్పగా నిలిచిపోయింది. తాజాగా భక్త కన్నప్ప చిత్రాన్ని మరోసారి తెరపైకి తీసుకు రావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యం మంచు విష్ణు ఈ చిత్రాన్ని తీస్తున్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో పై రెబల్ స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్త కన్నప్ప చిత్రం ఎవరెవరో తీయాలని చూస్తున్నారు కానీ దానిపై సర్వ హక్కులు ప్రభాస్ వే !భక్త కన్నప్ప గా ప్రభాస్ నటిస్తేనే అందం అంటున్నాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు .నలభై ఏళ్ల క్రితం రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన చిత్రం ''భక్త కన్నప్ప ''. కృష్ణంరాజు కెరీర్ లోనే మరుపురాని చిత్రంగా నిలిచిన ఆ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా రీమేక్ చేయాలనీ కృష్ణంరాజు ఎప్పటి నుండో ఆశిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం రిమెక్ సునీల్, మంచు విష్ణులు చేయడానికి రెడీ అయినా ఎందుకనో ఆ సినిమా సెట్స్ మీదకు మాత్రం వెళ్ళలేదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ తో ముందుగా ఓ ప్రేమ కథా చిత్రాన్ని దాని తర్వాత భక్త కన్నప్ప చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు కృష్ణంరాజు .
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..







