సత్యదేవ్ కు బాలీవుడ్ ఆఫర్…!
- May 29, 2021
హైదరాబాద్: టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కు బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో ‘పిట్ట కథలు’లో కనిపించిన ఈ యంగ్ హీరో ఖాతాలో “గుర్తుందా శీతాకాలం”, “తిమ్మరుసు”, “గాడ్సే” వంటి కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోకు బాలీవుడ్ లో నటించే బంపర్ ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించబోయే భారీ చిత్రం ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కు కీలక పాత్ర పోషించే సువర్ణావకాశం లభించింది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సహకారంతో అమెజాన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మేకర్స్ ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో సౌత్ నటులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. సత్యవ్దేవ్తో పాటు, నాజర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్ తన ప్రతిభను బాలీవుడ్ లో ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







