12 ఏళ్లు అంతకు మించిన వయసు కోవిడ్ పేషెంట్లకు కొత్త ట్రీట్మెంట్
- May 30, 2021
యూఏఈ: వేరియంట్లతో విరుచుకుపడుతున్న కోవిడ్ వైరస్ ను ఎదుర్కొనేందుకు కొత్త వైద్య విధానంలో ట్రీట్మెంట్ అందించే పద్దతికి యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. COVID-19 కు కొత్త చికిత్సగా సోట్రోవిమాబ్ (వీర్ -7831) ను అత్యవసరంగా వినియోగించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కోవిడ్ కు చికిత్స గా సోట్రోవిమాట్ విధానానికి అనుమతి ఇచ్చిన తొలి దేశం యూఏఈ కావటం విశేషం. ఈ విధానంలో కోవిడ్ బారిన పడి స్వల్ప లక్షణాలు ఉన్న పేషెంట్ల నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీని సేకరిస్తారు. కోవిడ్ కు చికిత్స పొందుతున్న 12 ఏళ్లు, అంతకుమించిన వయసు పేషెంట్ల హెల్త్ కండీషన్ క్రిటికల్ గా మారిన సమయాల్లో వారికి సోట్రోవిమాట్ విధానంలో మోనోక్లోనల్ యాంటీబాడీ ద్వారా చికిత్స అందిస్తారు. గ్లోబల్ లీడింగ్ హెల్త్ కేర్ కంపెనీ గ్లాక్సో స్మిత్ క్లైన్ సౌజన్యంతో ఈ చికిత్స విధానాన్ని అందిస్తోంది. ఈ విధానంలో మరణాలను 85 శాతం తగ్గించేందుకు ఆస్కారం ఉన్నట్లు గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







