భారత్ లో కరోనా కేసుల వివరాలు

- May 31, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.కోవిడ్ సెకండ్ వేవ్‌లో రోజువారి కేసులు 4 ల‌క్ష‌ల మార్క్‌ను కూడా దాటేసి క‌ల‌వ‌ర పెట్ట‌గా.. ఇప్పుడు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.మ‌రోవైపు రిక‌వ‌రీ కేసులు పెరుగుతూ.. ఊర‌ట క‌లిగిస్తున్నాయి.. ఇక‌, తాజా కేసుల‌తో క‌లుపుకుని.. 2.80 కోట్ల మార్క్‌ను దాటేశాయి పాజిటివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 1,52,734 కొత్త కేసులు న‌మోదు కాగా.. మ‌రో 3,128 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు.ఇదే స‌మ‌యంలో 2,38,022 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534కు చేరుకోగా.. కోవిడ్ బారిన‌ప‌డి కోలుకున్నవారి సంఖ్య 2,56,92,342కు చేరింది.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 3,29,100 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 20,26,092 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు కేంద్రం పేర్కొంది.మ‌రోవైపు.. 21,31,54,129 మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి అయిన‌ట్టు స్ప‌ష్టం చేసింది.నిన్న ఒకే రోజు దేశ్యాప్తంగా 16,83,135 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన టెస్ట్‌ల సంఖ్య 34,48,66,883కు పెరిగిన‌ట్టు ఐసీఎంఆర్ ప్ర‌క‌టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com