భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 31, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.కోవిడ్ సెకండ్ వేవ్‌లో రోజువారి కేసులు 4 లక్షల మార్క్‌ను కూడా దాటేసి కలవర పెట్టగా.. ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి.మరోవైపు రికవరీ కేసులు పెరుగుతూ.. ఊరట కలిగిస్తున్నాయి.. ఇక, తాజా కేసులతో కలుపుకుని.. 2.80 కోట్ల మార్క్‌ను దాటేశాయి పాజిటివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,52,734 కొత్త కేసులు నమోదు కాగా.. మరో 3,128 మంది కరోనాకు బలయ్యారు.ఇదే సమయంలో 2,38,022 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534కు చేరుకోగా.. కోవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 2,56,92,342కు చేరింది.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 3,29,100 మంది మృతి చెందారు. ప్రస్తుతం 20,26,092 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం పేర్కొంది.మరోవైపు.. 21,31,54,129 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు స్పష్టం చేసింది.నిన్న ఒకే రోజు దేశ్యాప్తంగా 16,83,135 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 34,48,66,883కు పెరిగినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









