ఆన్లైన్లో ఆనందయ్య కరోనా మందు పంపిణీ
- June 01, 2021
అమరావతి: కరోనా కోసం నెల్లూరు ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందు వల్ల ఇబ్బందులు లేవని ప్రభుత్వం తేల్చటం, కోర్టు కూడా మందు పంపిణీ కోసం అనుమతివ్వటంతో మందు తయారీ ఏర్పాట్లలో ఆనందయ్య శిష్యులు నిమగ్నమయ్యారు. అయితే ఆనందయ్య మందు పంపిణీ స్టార్ట్ చేస్తే… ప్రజలు భారీగా కృష్ణపట్నం వచ్చే అవకాశం ఉంది. దీంతో కరోనా ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మందు తయారీపై వన మూలికలు, ముడి పదార్థాలు సేకరిస్తూనే మందు పంపిణీపై ఆనందయ్య కార్యాచరణ ఆలోచిస్తున్నారు. మందు పంపిణీ స్టార్ట్ చేయటం మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉండగా, మందు పంపిణీపై ఆనందయ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో సమావేశం అయ్యారు. మందు కోసం ఎవరూ నెల్లూరు రావద్దని, అవసరం అయితే మొబైల్ యాప్ ద్వారా ఆనందయ్య మందును డోర్ డెలివరీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆనందయ్య కూడా ఈ అంశానికి మద్ధతు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా మందు పంపిణీ చేస్తే కరోనా నిబంధనల ఉల్లంఘన జరగదన్నారు. అయితే ఆనందయ్య పంపిణీ కోసం మరో ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్







