పోలీసుల‌పై షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతున్న రాజ‌మౌళి!

- June 03, 2021 , by Maagulf
పోలీసుల‌పై షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతున్న రాజ‌మౌళి!

హైదరాబాద్: క‌రోనా స‌మ‌యంలో ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ప‌లు సేవాకార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడు ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్.ఎస్. రాజ‌మౌళి. ఇప్పుడు ఆ సేవల‌ను మ‌రోర‌కంగా విస్త‌రించ‌బోతున్నాడు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌పై రాజ‌మౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతున్నాడ‌ట‌. దీని నిడివి 19 నిమిషాలు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ రూప‌క‌ల్ప‌న విష‌య‌మై ఇటీవ‌ల రాజ‌మౌళి సైబ‌రాబాద్ సి.పి. స‌జ్జ‌నార్, హైద‌రాబాద్ సి.పి.అంజ‌నీ కుమార్, రాచ‌కొండ సి.పి.మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. వారందరి నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావ‌డంతో రాజ‌మౌళి షార్ట్ ఫిల్మ్ నిర్మాణంపై ముంద‌డుగు వేశార‌ట‌. ఈ ల‌ఘు చిత్రం ద్వారా రాజ‌మౌళి పోలీసుల ప్రాధాన్యం, క‌రోనా స‌మ‌యంలో స‌మాజానికి వారు చేస్తున్న సేవ గురించి చ‌క్క‌ని, బ‌ల‌మైన సందేశాన్ని ఇవ్వ‌బోతున్నార‌ట‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com