ఆ ఫోటో తో తీపి కబురు చెప్తోందా?
- June 07, 2021
సమంత పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. రాజీ పాత్రలో సమంతను తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేని విధంగా తన పర్ఫార్మెన్స్తో ఇరగదీసింది. జూన్4న ప్రసారం అయిన ఈ వెబ్‌సిరీస్‌తో నటిగా సమంత మరింత పేరు సంపాదించింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా సెలక్టివ్ పాత్రలు పోషిస్తున్న సామ్..నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలకే సైన్ చేస్తోంది. ఆమె చివరగా నటించిన జాను చిత్రం నిరాశపరిచినా నటిగా సమంతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఆమె షేర్ చేసిన ఓ ఫోటోనే.
లేటెస్ట్గా సమంత తన సొంత లేబుల్ 'సాకీ' దుస్తులు ధరించి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే అందులో డ్రెస్ కంటే మామిడికాయను హైలైట్ చేయడంతో పలువురు నెటిజన్లు సామ్..నువ్వు తల్లి కాబోతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మునుపటి కంటే సమంత కాస్త ముద్దుగా కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులకు గుడ్‌న్యూస్ అంటూ నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో సమంత గర్భవతి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
గతంలోనూ సమంత ప్రెగ్నెన్సీపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో సమంత వాటిని ఖండించింది. అయితే లేటెస్ట్ ఫోటో మాత్రం ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్కు ఊతం ఇచ్చేలా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి సమంత స్పందిస్తుందో లేదో చూడాలి. 2017లో సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









