హెల్త్ స్టేటస్ నిర్ధారణకు కలర్ కోడింగ్

- June 08, 2021 , by Maagulf
హెల్త్ స్టేటస్ నిర్ధారణకు కలర్ కోడింగ్

యూఏఈ: కోవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతకు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కలర్ కోడింగ్ ద్వారా వ్యక్తుల హెల్త్ స్టేటస్ ను తెలిపేలా అల్ హోస్న్ యాప్ ను అప్ డేట్ చేసింది. ఈ మేరకు గ్రీన్ పాస్ ప్రోటోకాల్ కు ఆమోదం తెలుపుతూ కలర్ కోడింగ్ పని చేసే విధానాన్ని వివరించింది. ఆయా వ్యక్తులు వ్యాక్సినేషన్ తీసుకున్నారా..లేదా, ఫస్ట్ డోస్ తీసుకోని సెకండ్ డోస్ కోసం వేచి చూస్తున్నారా..లేదంటే వ్యాక్సిన్ డోస్ తీసుకొని ఎన్ని రోజులు అవుతోంది, పీసీఆర్ రిపోర్ట్ ఇలా అల్ హోస్న్ వినియోగదారుల కోవిడ్ స్టేటస్ ను కలర్ కోడ్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. 28 రోజులకు ముందే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా, క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారి అల్ హోస్న్ లో కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. 30 రోజుల పాటు గ్రీన్ స్టేటస్ ఉంటుంది. అలాగే వారం రోజుల పాటు E లేదా గోల్డ్ స్టార్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక సెకండ్ డోస్ తీసుకొని 28 రోజులు ముగియని వారికి పీసీఆర్ నెగటీవ్ 14 రోజుల పాటు గ్రీన్ స్టేటస్ చూపిస్తుంది. ఇక ఫస్ట్
డోస్ తీసుకొని సెకండ్ డోస్ కోసం వేచి చూసే వారికి వారం రోజుల పాటు గ్రీన్ స్టేటస్ కలర్ కోడింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రజల కదలికలను మరింత సులభతరం చేయటంతో పాటు పర్యాటక రంగంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఈ కలర్ కోడింగ్ స్టేటస్ దోహదపడనున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com