మెక్సికో రాయబారికి స్వాతంత్ర్య పురస్కారం
- March 06, 2016
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ మరియు మెక్సికో దేశాల మధ్య సహకారాన్ని అన్నిరంగాల్లో స్నేహపూర్వక సంబంధాలు మరియు ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా యు ఎ.ఇ. లో మెక్సికో రాయబారి ఫ్రాన్సిస్కో జేవియర్ అలోన్సో ఎస్కోబార్ కు స్వాతంత్ర్య ఖలీఫా అవార్డులు గౌరవ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాతంత్ర్య అవార్డును ప్రదానం చేశారు. మెక్సికో రాయబారి ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు తన కృతజ్ఞతలు మరియు ప్రశంసలను వ్యక్తం చేశారు. తన రాజకీయ జ్ఞానంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో మెక్సికో రాయబారి ఫ్రాన్సిస్కో జేవియర్ అలోన్సో ఎస్కోబార్ ప్రముఖ పాత్రను పోషించి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో కీలక పాత్రను వహించారని ప్రశంసించారు. రాయబారి ఎస్కోబార్ మాట్లాడుతూ తనకు అప్పగించిన భాద్యతను నిజాయితీగా పనిచేయడం ద్వారా ఈ గౌరవాన్ని దక్కించుకొన్నట్లు తెలిపారు. తన పదవీ కాలములో యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ప్రభుత్వ సహకారం అధికారుల మంచితనం తన విజయానికి దోహదపడిందన్నారు. ఇందుకు తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు,
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







