కువైట్ ఎయిర్‌వేస్ కొత్త బ్యాగేజ్ పాలసీ
- March 06, 2016
కువైట్ ఎయిర్‌వేస్ కొత్త బ్యాగేజీ పాలసీని ప్రకటించింది. 'బ్యాగేజ్ మేడ్ సింపుల్' పేరుతో ప్రకటించిన ఈ పాలసీ, విమాన ప్రయాణీకులకు కొంత ఊరటగానే చెప్పాలి. ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు మేగ్జిమమ్ బ్యాగేజీ అనుమతి 64 కేజీలకు పెంచారు. ఇది గతంలో 40 కేజీలుగా ఉంది. ఒక్కో బ్యాగేజీ 32 కిలోల చొప్పున, రెండు బ్యాగ్‌లకు అనుమతిస్తారు. బిజినెస్ క్లాస్ ప్రయాణీకులకు ఒక్కో బ్యాగేజీ బరువు 23 కిలోల చొప్పున రెండు బ్యాగ్‌లకుగాను 46 కిలోల వరకు అనుమతించనున్నారు. ఇది గతంలో 30 కేజీలదాకా ఉంది. ఎకానమీ క్లాస్‌లో అమెరికాకి వెళ్ళడం లేదా అమెరికా నుంచి రావడం చేసేవారికి ఒక్కో బ్యాగేజీకి బరువు 23 కిలోలుగా నిర్ధారించారు. రెండు బ్యాగ్‌లను తీసుకెళ్ళవచ్చు. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా అదనంగా మరో 23 కిలోల బ్యాఞగేజీని ఏప్రిల్ 30 వరకు అనుమతిస్తారు. అయితే ఇది అమెరికాకి వెళ్ళే లేదా వచ్చే ప్రయాణీకులకు వర్తించదు. ఒయాసిస్ గోల్డ్ మెంబర్స్ 23 కిలోల ఎక్స్‌ట్రా బ్యాగ్ ఎలవెన్స్ పొందగలరు. ఇన్‌ఫ్యాంట్స్ కూడా 10 కిలోల బ్యాగ్‌కి అనుమతించబడ్తారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







