IBPSలో 10వేల బ్యాంకు ఉద్యోగాలు..
- June 08, 2021
న్యూ ఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్) మల్టీపర్సస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రూరల్ బ్యాంకుల్లో 10వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజే ప్రారంభమైంది. అప్లైకి ఆఖరు తేదీ ఈనెల 28. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ https://www.ibps.in.
IBPS RRB Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు విద్యార్హత: ఆఫీసర్ స్కేల్ 1,2,3 పోస్టులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు: ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ I పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ II పోస్టుకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ III పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్దులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.180.
తాజా వార్తలు
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్







